కౌశల్ ఆర్మీ సభ్యుులను రెచ్చగొట్టి వారి ద్వారా తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ట్రోల్స్ చేయిస్తున్నారనే ఆరోపణలపై కౌశల్ స్పందించారు. నేను ఎవరికీ ట్రోల్ చేయమని చెప్పలేదు. నన్ను నమ్ముకుని కౌశల్ ఆర్మీలో ఉన్న అమ్మాయిలను బూతులు తిడితే.. వారికి తగిన సమాధానం ఇవ్వాలని మాత్రమే చెప్పాను. రోల్ రైడా వీడియో పెట్టినపుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఓ అమ్మాయి కామెంట్ పెడితే ఆమెను కొందరు బూతులు తిడుతూ కామెంట్ పెట్టారు. వారిని సమాధానం చెప్పండి అన్నట్లు కౌశల్ వివరణ ఇచ్చారు. ఓ టీవీ ఛానల్‌లో నేను మాట్లాడిన ఆడియో క్లిప్ వినిపించి నేను అందరినీ ట్రోల్స్ చేసే విధంగా రెచ్చగొడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ రెచ్చగొట్టలేదు. ఎవరైతే అమ్మాయిలను బూతులు తిట్టారో వారికి సమాధానం చెప్పాలని కోరాను. బూతులు తిట్టిన వారిపై ఆల్రెడీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. నాతో సినిమా చేస్తానని వచ్చారు నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోమిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చారు. అన్నయ్యా నేను మీకు వారాభిమానిని, మీ తొలి సినిమా నేనే చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. మూడు నెలలు నన్ను హోల్డ్‌లో పెట్టి మరో పది రోజుల్లో సినిమా మొదలు పెడదామనుకునే సమయంలో అన్నయ్యా నేను ఇపుడు సినిమా చేయాలనుకోవడం లేదు. డబ్బు వేరే స్థాలాలకు ఇన్వెస్ట్ చేశాను. తనీష్ మూవీకి ఫైనాన్స్ వేరే వారిచేత ఇప్పిస్తున్నాను అని చెప్పారు. అలా చెప్పడానికి వారం ముందే ఆయన నాకు 9.5 లక్షల చెక్ ఇచ్చారని కౌశల్ చెప్పుకొచ్చారు. కుట్ర చేసింది తనీష్ నేను ఈ సందర్భంగా తనీష్‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నపుడే. కుట్రలు చేసి నా మీద గెలిచాడు. అందుకు అతడిని అప్రిషియేట్ చేస్తున్నాను. నాతో సినిమా చేస్తాను అనే వారికి ఫోన్ చేసి, నాకు వ్యతిరేకంగా ఉన్నవారిని, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కూడబెట్టుకుని, నా మీద ఇన్ని చేయిస్తున్నారు. నాకు సినిమా అవకాశం కూడా లేకుండా చేశాడు. తనీస్ నిజంగా గ్రేట్. నన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నందుకు థాంక్యూ సోమచ్. ప్రూప్స్ చూపించండి బాబు గోగినేని గారు యూకెలో ఉండి మాట్లాడటం కాదు. ఇండియా వచ్చి మాట్లాడండి. మీరు మా ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని ఆరోపణలు చేయడం కాదు, ప్రూఫ్స్ చూపించండి. నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడే నా కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి వారిని పెయిడ్ ఆర్మీని ఎలా అంటారు. మీరు నా దగ్గరికి రాక పోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆస్ట్రేలియా వచ్చాను. అక్కడ ధైర్యంగా డిబేట్ పెట్టించాను. అక్కడే మీరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించాను. దమ్ముంటే ఇండియాకు రా, నన్నేమీ పీకలేరు బాబు గోగినేని ఇండియాలో అరెస్ట్ వారెంట్లు ఉండటంతో విజయ్ మాల్యా మాదిరిగా యూకె వెళ్లారు. కౌశల్ ఆర్మీని గొర్రెలు అనడానికి మీకు ఏం హక్కు ఉంది? కౌశల్ ఆర్మీ పేరుతో ఓ పది మంది వచ్చి టీవీ ఛానల్స్ లో మాట్లాడితే నమ్మేస్తారా? ఇదంతా తనీష్, తేజస్వి, బాబు గోగినేని కలిసి చేస్తున్నదే. అంతా సిండికేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోనే నన్ను స్పాయిల్ చేయాలని చూశారు. అక్కడ ఏం జరిగిందో ప్రజలు చూశారు. అని కౌశల్ ప్రశ్నించారు.